11-08-2025 01:56:15 AM
14, 15న అతి భారీ వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 11న ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, సిద్ధిపేట, యాదా ద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12న ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్ష సూచన ఉంది.
14,15న అతి భారీ వర్షాలు
ఈ నెల 14న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 15న ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబా ద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబా ద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సం గారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.