వేగవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఏప్రిల్ 27(విజయ క్రాంతి) : జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులను, వ్యవసాయ, సివిల్ సప్ప్లై అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను నిర్వాహకులని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని ఇప్పటి వరకు 880. మంది రైతుల నుండి 4270. 040 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని 38 మంది రైతులకు -42 లక్షల రూపాయలు ఎకౌంట్లో జమ చేసే మన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, తాసిల్దార్ సింధు రేణుక, ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






