07-07-2025 01:27:55 AM
ప్రతి జిల్లాలోనూ అర్హులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యుడు బి బసవ పున్నయ్య
వనపర్తి, జూలై 6 ( విజయక్రాంతి ) : గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్ కా ర్డులను మళ్లీ మళ్లీ పొడిగించే పద్ధతి సరికాదని, వాటి స్థానంలో ప్రతి జర్నలిస్టుకు నూ తన అక్రిడిటేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని తెలంగాణ వ ర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ మీడియా సలహా మండ లి సభ్యుడు బి బసవ పున్నయ్య డిమాండ్ చే శారు.
జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు జూటూరు రాము అ ధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బసవ పున్నయ్య మాట్లాడుతూ గతం నుంచి పెం డింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలన్నీ ప్ర భుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచిన నేటికి రాష్ట్ర జర్నలిస్టులందరికీ నూతన అక్రిడిటేషన్ కార్డులను అందజేయకుండా, గత ప్రభుత్వం ఇచ్చిన కా ర్డులనే మళ్లీ మళ్లీ గడువు పొడిగిస్తూ కాలం వెళ్ళదీయడం సరైన పద్ధతి కాదన్నారు. రా ష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నూతన అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన కార్డులను ప్ర భుత్వం నుంచి అందజేయించడంలో ప్రెస్ అకాడమీ విఫలమైందని అన్నారు.
రాష్ట్రం లో జర్నలిస్టులంతా అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు అర్హత ఉండి కూడా ఇండ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించలేకపోవడం దారుణం అన్నారు. ప్రతి జి ల్లాలోనూ 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారని, వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాల తో పాటు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వమే కట్టించే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో తెలంగాణ వచ్చాక ఇప్పటికే దా దాపు 550 మంది జర్నలిస్టులు వివిధ అనారోగ్య ఇతర కారణాల చేత మృతి వాత పడ్డా రని, వారి కుటుంబాల జీవనోపాధికి ప్రభు త్వం ప్రత్యేక నిధి ని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. స్థానిక జర్నలిస్టుల సమస్యలన్నీటిని టిడబ్ల్యూజేఎఫ్ నూతనంగా ఏర్పడిన జిల్లా కమిటీ జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి, అలాగే మంత్రి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు.
ఏళ్ల తరబడి దాదాపు 100 మం ది జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాల కేటాయింపును వెంటనే చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వమే కాంపెన్సేషన్ అందజేసి ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యా అవకాశాల్లో రా యితీలు, ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య ఖర్చులను రాయితీలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
సామాన్యులకు అందజేస్తున్నట్లు జర్నలిస్టులకు కూడా ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చే యాలని ప్రతి జర్నలిస్టును ఆరోగ్యవంతంగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జేఎ ఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి జగదీష్, జిల్లా ఉపాధ్యక్షులు కే సు రేందర్, సీనియర్ జర్నలిస్టు అశోక్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.