07-07-2025 01:25:41 AM
200 మంది పార్టీ లో చేరికలు: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, జులై 06 ( విజయక్రాంతి ) : కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా స్థానిక ఎన్నికల్లో స త్తా చాటాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకులకు సూచించారు. ఆదివారం ప ట్టణానికి చెందిన సాయి ప్రసాద్ యాదవ్ తో 200 మంది బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన నా యకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలోబి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తాము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని దుస్థితి ఏర్పడ్డదని .ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను హరిగోస పెడుతున్నారని ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతు భరోసా 15000ఇస్తామని ఎగ్గొటారని ఆసరా పింఛన్లు 4000ఇస్తామని ఇవ్వలేదని, కళ్యా ణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మొండి చేయి చూపించారన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కు ఎన్నో ఆంక్షలు పెట్టీ ఎగ్గొట్టే పని చేస్తున్నారని,మన హయాములో నియోజకవర్గంలో 3250డబల్ బెడ్ రూమ్స్ కట్టించామని నాయకులు,కార్యకర్తలు ప్రజలకు వివరించి బి.ఆర్.ఎస్ అభ్య ర్థులను గెలిపించాలని అభ్యర్థించాలని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గ ట్టు యాదవ్,జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మండల పార్టీ అధ్యక్షులు కే.మాణిక్యం,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,కురుమూర్తి యాదవ్,,తదితరులు పాల్గొన్నారు.