7 August, 2026 | 12:57 AM

హిల్ట్ పాలసీ గడువు పెంపు

07-08-2026 12:00 AM

అక్టోబర్ 31 వరకు దరఖాస్తుల స్వీకరణ  

హైదరాబాద్, ఆగష్టు 6 (విజయక్రాంతి): హైదరాబాద్ పరిసర పారిశ్రామిక భూములను బహుళ వినియోగ (మల్టీ-యూజ్) జోన్లుగా మార్చేందుకు అమలు చేస్తున్న హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ కింద దరఖాస్తుల గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ మేరకు గురువారం జీవో నంబర్ 26ను జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హిల్ట్ పాలసీ కింద ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన పోర్టల్‌ను అక్టోబర్ 31 వరకు మరో మూడు నెలల అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పాత ఎస్‌ఆర్వో రేట్లనే  వర్తింపజేయాలని స్పష్టం చేసింది. గతంలో పోర్టల్  జూన్ 1 నుంచి జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉండటంతో పరిశ్రమల సంఘాలు, సేవా సంఘాలు, ఇతర వాటాదారుల విజ్ఞప్తుల మేరకు  పరిశీలించిన ప్రభుత్వం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.