ఘనంగా జయశంకర్ జయంతి
పార్టీలకు అతీతంగా నివాళులు
సికింద్రాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా,ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92 వ జయంతి సందర్భంగా న్యూ బోయిన్ పల్లి, జయనగర్ చౌరస్తాలో జంపన ప్రతాప్, టి.ఎన్.శ్రీనివాస్,బానుక మల్లికార్జున్, జక్కుల మహేశ్వర్ రెడ్డి, సదా కేశవరెడ్డి, పాండు యాదవ్, వంశీ తిలక్ హాజరై ఆ మహనీయుడి కి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో,ఉద్యమానికి దిశానిర్దేశం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని పేర్కొన్నారు. తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడు జయశంకర్ ని కొనియాడారు.
జయశంకర్ సారు ఆశయాలు, విలువలు, నిబద్ధత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాసేవ లక్ష్యాల సాధనకు ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని జంపన ప్రతాప్,బానుక మల్లికార్జున్, జక్కుల మహేశ్వర్ రెడ్డి, సదా కేశవరెడ్డి,పాండు యాదవ్,వంశీ తిలక్ వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కేక్ కట్ చేసి, పలువురిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ చంద్ర, బోయిన్ పల్లి మార్కెట్ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్, ఓం ప్రకాష్ యాదవ్, బి.ఎన్ శ్రీనివాస్, ముకేశ్, మధు,బండి శ్రీనివాస్,ముద్దం రాజు యాదవ్, డి.శ్రీనివాస్,సాయిబాబా యాదవ్, వెంకట చారీ తదితరులు పాల్గొన్నారు..






