calender_icon.png 15 December, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ముసుగులో బలవంతపు వసూళ్లు

13-12-2025 12:36:24 AM

  1. ఒకరి అరెస్ట్, కారు, 50 వేల రూపాయలు స్వాధీనం 

నిందితుల్లో ముగ్గురు మీడియా ప్రతినిధులు 

మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల మంటూ ముగ్గురు వ్యక్తులు కారులో వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి తనిఖీ చేసి అందులో మద్యం ఉండడంతో పట్టుకొని నీ మీద కేసు కాకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటనలో శుక్రవారం ఓ వ్యక్తిని అరెస్టు చేసి 50 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్ ఐ జీ.ఉపేందర్ తెలిపారు. ఈ సంఘటనకు పాల్పడ్డ ముగ్గురు నిందితులు మీడియా ప్రతినిధులుగా పని చేస్తున్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు.

సంఘటనకు సంబంధించిన వివరాలు ఎస్త్స్ర కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. ఈనెల 11న ములుగు నివాసి ధరావత్ ఆనంద్ పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో తొర్రూరు పాలకేంద్రం దగ్గర ఆగి మద్యం కొనుక్కొని తన కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో అతని వెంబడించి దారి మధ్యలో అడ్డగించి ఎన్నికల ఫ్లైయింగ్ స్కాడ్ అధికారులమని కారును తనిఖీచేయాలని నిలిపారు.

కారును తనిఖీ చేసి అందులో ఉన్న మద్యం పట్టుకొని ఇప్పుడు నీ మీద కేసు అవుతుందని, కేసు నుంచి నిన్ను వదిలిపెట్టాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తూ ఆనంద్, డ్రైవర్ కుమార్ ను కారులోనే బంధించగా, భయపడ్డ వాళ్లు వెంటనే సమీప బంధువు దగ్గర ఒక లక్ష రూపాయలు సర్దుబాటు చేసి వీరికి ఇచ్చి కారును డ్రైవర్ను విడిపించుకు వెళ్లాడు.

బాధితుడు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు వినియోగించిన కారు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు వారు అధికారులు కారని తేల్చి, సంఘటనలో పాల్గొన్న జాటోత్ ఉపేందర్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నేరానికి పాల్పడ్డ కారు, సెల్ఫోన్, 50వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.

ఈ సంఘటనలో తొర్రూరుకు చెందిన ఇద్దరూ మీడియా ప్రతినిధులు ఉన్నట్లు గుర్తించామని, వారిని త్వరలో పట్టుకొని అరెస్టు చేయనున్నట్లు ఎస్త్స్ర వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల పేరుతో ముగ్గురు మీడియా ప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.