calender_icon.png 16 December, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురేందర్‌కు హన్మకొండ జిల్లా నేషనల్ ఫెలోషిప్ అవార్డు

13-12-2025 12:37:58 AM

భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామనికి చెందిన సామాజిక వేత్త, బీసీ ఉద్యమ నాయకుడు అనేక సామాజిక పోరాటాలు చేసిన మండల సురేందర్ కు, పద్మశాలి 2025 కు గాను మహాత్మా జ్యోతి భా పులే నేషనల్ ఫెలోషిప్ అవార్డు ను డాక్టర్ ఏస్.సుమనాక్షర్, జాతీయ దళిత సాహిత్య అకాడమి అధ్యక్షులు న్యూ ఢిల్లీ వారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మండల సురేందర్ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన డాక్టర్ జితేందర్ మను భారతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, దక్షిణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాతీయ అవార్డుతో భాధ్యత పెరిగి బహుజనుల పక్షాన ఉద్యమాలు చేస్తూ సమాజంలో అంతరాలను తొలగించుటకు భాధ్యత పెరిగిందని, త్రికరణ శుద్ధితో బాధ్యత నెరవేరుస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటానన్నారు. తన సేవలను గుర్తించి ఈ అవార్డు రావడానికి సహకరించిన చిప్ప వెంకటేశ్వర్లు నేత కు కృతజ్ఞతలు తెలిపారు.