13-12-2025 12:34:49 AM
315 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం
మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): పంచాయతీ తొలిపోరులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం నిర్వహించిన 555 గ్రామపంచాయ తీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 315 స ర్పంచ్ స్థానాల్లో విజయ సాధించడంతో పం చాయతీల్లో పట్టు సాధించింది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 149 స్థానాల్లో విజయం సాధించగా, బిజెపి సైతం ఈసారి ఆశాజనకంగా 20 స్థానాల్లో తమ మద్దతు దారు లను సర్పంచులుగా గెలిపించుకున్నారు.
అలాగే 64 చోట్ల వివిధ పార్టీల రెబల్, ఇండిపెండెంట్ లు గెలుపొందారు. మహబూబా బాద్ జిల్లాలో తొలి విడత నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 80 గ్రామాల సర్పంచ్ పదవులను దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు టర్ములు బిఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ విజయం సాధించి స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నారు.
అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా మురళి నాయక్ విజయం సాధించారు. ఈ క్రమం లో మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మహబూబాబాద్, గూడూర్, కేస ముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లోని 155 సర్పంచ్ పదవులకు తొలి విడత ఎన్నికలు నిర్వహించారు.
ఇందులో తొమ్మి ది పంచాయతీలో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 146 సర్పంచ్ పదవులకు, వార్డు సభ్యుల పదవులకు గురు వారం ఎన్నికలు నిర్వహించగా, 80 పంచా యతీలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 47 పంచాయతీల్లో బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 5 పంచాయతీలో బిజెపి బలపరిచిన అభ్యర్థులు, 14 పంచాయతీల్లో స్వతం త్ర అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికయ్యా రు.
ఎమ్మెల్యేగా డాక్టర్ భూక్యా మురళి నా యక్ తొలిసారిగా ఎన్నికైన తర్వాత, అలాగే ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ ఉమ ఇటీవలే మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇం దులో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో పట్టు నిలుపుకున్నట్లయ్యింది .
మానుకోట అసెంబ్లీ సెగ్మెంట్లో ‘మేజర్’ హస్తం పాగ!
మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు మండలాల్లో తొలి విడత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో మేజర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం తో మేజర్ పంచాయతీలో కాంగ్రెస్ ‘పాగా’ వేసినట్లయ్యింది. ఇనుగుర్తి మండల కేంద్రంలో సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తమ్మడపల్లి కుమార్ విజయం సాధించారు.
అలాగే గూడూరు మండల కేంద్రంలో సర్పంచ్ పదవికి కాంగ్రెస్ బలపరిచిన వాం కుడోత్ సునీత విజయం సాధించారు. ఇక ఇదే తరహాలో నెల్లికుదురు మండల కేంద్రం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ బలపరిచిన పులి వెంకన్న విజయం సాధించారు. ఇక మిగిలిన రెండు మండలాలు మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీలు కావడంతో మండల కేంద్రాలు మినహా గ్రామీణ ప్రాం తాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు.
రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్, 4,928 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు.