calender_icon.png 9 October, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల రాజ్యాధికార స్థాపనపై ముఖాముఖి

09-10-2025 01:01:36 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న

ఖైరతాబాద్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి) : బీసీలను రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న తెలిపారు. బుధ వారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సామాజిక తెలంగాణ  ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ మురళి మనోహర్, దేవల సమ్మ య్య, నరేంద్రబాబు, కొండల్ రావు, జ్వాలి త, తుల్జారాం, నగేష్ తదితరులు హాజరై తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించడానికి గల కారణాలు, పార్టీ భవిష్యత్తు కార్యా చరణ, బీసీ రాజ్యాధికారం కోసం ఏమి చేయాలి తదితర అంశాలపై  మల్లన్నతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ..

గత పది సంవత్సరాలుగా తెలంగా ణ విధ్వంసానికి గురి అయింది అని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు వాగ్దానాలను నమ్మే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేశారని అన్నారు. కానీ వాగ్దానాలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని తెలిపారు. మేధావులు అందరూ కలిసి తెచ్చు కున్న తెలంగాణలో సామాజిక న్యాయం జరగడంలేదని అన్నారు.

బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే చట్టసభలలో బీసీ బిల్లును ఆమో దం చేసిన తర్వాత అఖిలపక్షాన్ని వెంట తీసుకెళ్లి ప్రధానమంత్రి ముందు ఉంచేవాడని అన్నారు.

తమ పార్టీ అధికారం అనంతరం రాష్ట్రంలో మద్యపాన నిషేధంతోపాటు విద్య, ఉద్యోగ ఉపాధి రం గాలలో సమూలమైన మార్పులకు శ్రీకా రం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యాధికారం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.