09-10-2025 01:03:01 AM
-రాష్ట్రంపై క్యుములోనింబస్ ప్రభావం!
-అర, కిలోమీటర్ పరిధి తేడాలోనే వర్షాలు
-గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి
-రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని క్యుములోనింబస్ మేఘా లు కమ్మేశాయి. దీంతో మేఘం ఉన్నచోటే వానలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాల్లో ఈ ప్రభావం కనిపిస్తున్నది. ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోతోంది. గంటల వ్యవధిలోనే వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నా యి. ఫలితంగా అర కిలోమీటర్, కిలోమీటర్‌లోపే భారీ వర్షం కురుస్తున్నది.
ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలం జూన్ 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మాత్రమే ఉన్నప్పటికీ అక్టోబర్ రెండో వారం గడుస్తున్నా ఇం కా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాగా రాష్ట్రంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసిం ది. నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ వర్షా లు కురుస్తాయని హెచ్చరించింది.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రా ద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామా రెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవా రం, శనివారం, ఆదివారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.