26 March, 2026 | 3:45 PM

Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •  

నకిలీ పత్తి విత్తనాల విక్రేత అరెస్ట్

17-06-2025 10:36 PM

25 కేజీల విత్తనాలు స్వాధీనం..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి శివారులో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్(CI Afzaluddin) తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చయ్యపల్లి గ్రామ శివారులో 25 కేజీల Glycolic Cotton Seeds(Spurious Seeds) పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు బుచ్చయ్యపల్లి గ్రామ శివారులో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాడని సమాచారం మేరకు బెల్లంపల్లి వ్యవసాయ అదికారి సుద్దాల ప్రేమ్ కుమార్ తో పోలీసులు కలిసి రైడ్ చేయగా పెద్ద దుబ్బు శివారులో మాకినేని వెంకట నారాయణ పట్టుపడ్డాడు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా కంట వారిపాలెంకు అతడు బుచ్చయ్య పల్లిలో ఉంటూ కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అతడు ఆంధ్రప్రదేశ్ నుండీ చిలకలూరిపేటకు చెందిన జగన్ నుండి Glycolic Cotton Seeds(నకిలీ పత్తి విత్తనాలు) తెచ్చి బుచ్చయ్య పల్లేలో సాగు చేస్తున్నాడు. మరిన్ని లాభాల కోసం నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడు. అతని దగ్గర నుండి 25 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసి తాళ్ల గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.