26 March, 2026 | 1:59 PM

Breaking News

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •   ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది సున్నా   •   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •  

రేషన్.. పరేషాన్

18-06-2025 12:00 AM
  1. మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వడంతో లబ్ధిదారుల ఇక్కట్లు

ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం.. 

గిరిజన తండాల్లో సిగ్నల్స్ రాక సాంకేతిక సమస్యలతో జాప్యం

రేషన్ దుకాణాల వద్ద బియ్యం పొందేందుకు తగాదాలు

ఈనెలాఖరు వరకు బియ్యం తీసుకోవచ్చని అధికారుల వెల్లడి

నిర్మల్, జూన్ 17 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రేషన్ దుకాణాల వద్ద రేషన్ బియ్యం పొందేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతినెల అందించే రేషన్ బియ్యం మూడు నెలల కోట ఒకేసారి ఇవ్వడంతో బియ్యం పంపిణీలు సాంకేతిక సమ స్యలు సమయం వృథా కావడంతో డీలర్లు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

జూన్, జూ లై, ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచి రేషన్ దుకాణాల్లో మూడు నెలల కోట ఒకేసారి పంపిణీకి చర్యలు చేపట్టిన విషయం తెలిసింది. జిల్లాలో మొత్తం 2 లక్షల 15 వేల రేషన్ కార్డులు ఉండగా జిల్లాలో 402 రేషన్ దుకాణాల్లో రేషన్ డీల ర్లు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం గత నెల నుంచి సన్నారకం బియ్యం సరఫరా చేయడంతో రేషన్ లబ్ధిదారులు బియ్యాన్ని తీసుకునేందుకు పోటీ పడుతున్నారు.

అయి తే ప్రతినెలా రేషన్ పంపిణీ చేపట్టగా లబ్ధిదారులు ఒకసారి వేలిముద్రవేసి బియ్యం తీసుకునే అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభు త్వం వానాకాలం సీజన్ నేపథ్యంలో ఇప్పు డు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం తో ఒక వ్యక్తి మూడుసార్లు వేలిముద్ర వేయడం ఐరిష్ విధానాల్లో బియ్యం పంపి ణీ చేపట్టడంతో ఒక్కొక్కరికి 10 నిమిషాల సమయం పడుతుందని రేషన్ డీలర్లు వాపోతున్నారు.

దీనికి తోడు  జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలు గ్రామాల కు పట్టణాలకు దూరంగా ఉన్న గిరిజన తండాలో సిగ్నల్ రాకపోవడంతో బియ్యం పంపిణీకి ఆటంకం ఏర్పడుతుంది. ఆన్లైన్లో అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాతనే బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉండడం తో సిగ్నల్ రాకపోవడం సర్వర్ బిజీ కారణం గా కొన్ని గ్రామాల్లో బియ్యం పంపిణీ తీవ్ర జాప్యం జరుగుతుంది. 

సిగ్నల్ సమస్యతో ఇబ్బందులు 

జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,30,000 మంది రేషన్ బియ్యం పొందాలని అయితే కొన్ని గ్రామాల్లో సాంకేతిక సమస్య ఇతర సమస్యల కారణంగా బియ్యం పంపిణీ ఆలస్యం కావడంతో రేషన్ దుకాణాల వద్ద జనం రద్దీ పెరిగి చిన్న చిన్న తగాదాలను గొడవలకు దారితీస్తున్నాయి. జిల్లాలో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లిన జనం క్యూలైన్ పాటించడం, సంచులను క్యూలైన్‌లో పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ గొడవలు జరగడం వల్ల రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.

తాజాగా బైంసా మండలంలోని చుచుండు గ్రామంలో మంగళవారం బియ్యం పొందినందుకు వచ్చిన రేషన్ కార్డుదారులు ఆందో ళన చేసి ఒకరిపై ఒకరు తోపులాడుకుంటూ గొడవకు దిగిన ఘటన ప్రత్యేక ఉదారణంగా చెప్పుకోవచ్చు. సిగ్నల్ పూర్‌గా ఉన్న గ్రామాల్లో ప్రతిరోజు బియ్యం కోసం వచ్చి సిగ్నల్ సమస్యతో తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందని రేషన్ కార్డు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు మాత్రం ఈనెల 31 వరకు రేషన్ దుకాణాలను తెరిచి ఉంచి ప్రతి ఒక్కరికి బియ్యం అందించాలని డీలర్లను ఆదేశించినట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా ఒకేసారి రేషన్ షాప్‌కు వెళ్లకుండా కొందరు కొందరు వెళ్లాలని సూచించారు.