calender_icon.png 15 September, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఫారెస్ట్ అధికారుల అరెస్ట్

16-12-2024 12:50:14 AM

ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

సిరిసిల్ల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): అమయాకుల వద్ద ఫారెస్ట్ అధికారులమని డబ్బులు వసూలు చేసిన నకిలీ అధికారులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముస్తాబాద్  ఎస్సై గణేస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన కోటా మహేష్, దానవేణి పల్లన్న ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ శివారులో ముళ్లపంది మాంసం విక్రయించేందుకు వచ్చారు.

వారిని చూసిన దుబ్బాక మండలం పోతారానికి చెందిన గండికోటా దేవరాజు, లింగన్నపేటకు చెందిన గొల్లిని దేవరాజు తాము ఫారెస్ట్ పోలీసులమని బెదిరింపులకు పాల్పడ్డారు. వారి నుంచి రూ.20 వేల డిమాండ్ చేశారు. దీంతో ఫోన్ పే ద్వారా వారికి బాధితులు డబ్బులు పంపారు. తర్వాత ఫారెస్ట్ అధికారులు కారని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై గణేష్ నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.