07-07-2025 01:31:05 AM
- పంజాబ్‌లోని భటిండాలో సీవోవో ఆర్యన్‌సింగ్‌ను పట్టుకున్న తెలంగాణ సీఐడీ
- ఇప్పటివరకు 9 మంది అరెస్ట్..కొనసాగుతున్న దర్యాప్తు
- 7,056 మంది డిపాజిటర్లకు రూ.792 కోట్లకు టోకరా
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన ఫాల్కన్ గ్రూప్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ భారీ మోసం కేసులో కీలక సూత్ర ధారి, కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) ఆర్యన్‌సింగ్ అలియాస్ ఆర్యన్ సింగ్ ఛాబ్రాను తెలంగాణ సీఐడీ పోలీసులు అరె స్ట్ చేశారు.
అధిక వడ్డీ ఆశ చూపి, బడా కంపెనీల పేరుతో నకిలీ డీల్స్ సృష్టించి, దాదాపు 7,056 మంది నుంచి రూ.4,215 కోట్లు డిపాజిట్లుగా సేకరించి, అందులో రూ.792 కోట్లను పక్కదారి పట్టించినట్లు సీఐడీ తేల్చింది.
నేరం బయటపడటంతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నించి, పంజాబ్‌లోని భటిండాలోని ఒక గురుద్వారాలో తలదాచుకున్న ఆర్యన్ సింగ్‌ను ప్రత్యేక బృందం జూలై 4న చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. ట్రాన్సిట్ రిమాండ్‌పై హైద రాబాద్‌కు తరలించి, శనివారం నగరంలోని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
భారీ లాభాలు వస్తాయని నమ్మించి..
ప్రధాన నిందితుడు ఎండీ అమర్‌దీప్‌కుమార్‌తో కలిసి ఆర్యన్‌సింగ్, యోగేందర్ సిం గ్, పవన్‌కుమార్ ఓదెల, కావ్య నల్లూరి తదితరులు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. దీనికి అనుబంధంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో యాప్, వెబ్‌సైట్‌ను ప్రారం భి ంచారు.
బ్రిటానియా, అమెజాన్, గోద్రెజ్ వ ంటి ప్రఖ్యాత బహుళజాతి సంస్థలతో త మ కు ఒప్పందాలు ఉన్నాయని, ఆ కంపెనీల ఇ న్వాయిస్‌లపై పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే భారీ లాభాలు వస్తాయని సోష ల్ మీ డియా, టెలీకాలర్ల ద్వారా విస్తృతంగా ప్రచా రం చేశారు.
ఈ ప్రచారాన్ని నమ్మిన వేలాది మంది రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వర కు పెట్టుబడులు పెట్టారు. ఆరంభంలో న మ్మకం కుదిర్చేందుకు కొందరికి వడ్డీతో స హా సక్రమంగా చెల్లింపులు జరిపారు. డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లు జమ కా గా నే, కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేసి బో ర్డు తిప్పేశారు. ఇలా సుమారు 4,065 మ ంది బాధితులకు చెందిన రూ.792 కోట్లను 14 నకిలీ కంపెనీల్లోకి మళ్లించి కాజేశారు.
ఆర్యన్ సింగ్‌దే కీలకపాత్ర..
ఈ మొత్తం కుంభకోణానికి ఆర్యన్ సింగ్ ముఖ్యంగా వ్యవహరించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. బాధితులతో నేరుగా మా ట్లాడటం, నమ్మకం కలిగించడం, రశీదులు జారీ చేయడంలో అతడే కీలకంగా ఉన్నాడు. వ్యక్తిగతంగా సుమారు రూ.14.35 కోట్లను వ్యూహాత్మక డిపాజిట్ల రూపంలో సేకరించా డు.
అంతేకాకుండా, కంపెనీ నిధుల నుంచి రూ.1.62 కోట్లను తన సొంత ఖాతాలోకి మ ళ్లించుకున్నాడు. నేరం బయటపడగానే హైదరాబాద్ నుంచి నాందేడ్‌కు, అక్కడి నుంచి ప ంజాబ్‌లోని భటిండాకు పారిపోయి ఒక గు రుద్వారాలో తలదాచుకున్నాడు.
పక్కా స మాచారంతో అక్కడికి వెళ్లిన సీఐడీ బృందం అరెస్ట్ చేసి, రెండు సెల్‌ఫోన్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకు ంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆర్యన్‌సింగ్‌తో కలిపి మొత్తం 9 మందిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మిగతా నిందితుల కో సం గాలిస్తున్నామని సీఐడీ అదనపు డీజీపీ తెలిపారు. అధిక వడ్డీ, నమ్మశక్యం కాని రాబడులు వస్తాయని చె ప్పే ఆన్‌లైన్ పోంజీ పథకాలను నమ్మి కష్టార్జితాన్ని మోసగాళ్ల పాలు చేయవద్దని సీఐడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.