07-07-2025 01:29:31 AM
- బీహార్‌ను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారని ఆరోపణ
- పట్నాలో దారుణహత్యకు గురైన వ్యాపారవేత్త
- అసెంబ్లీ ఎన్నికల ముందు సర్కారుపై విపక్షాల ధ్వజం
పట్నా, జూలై 6: పదేండ్ల ఎన్డీయే పాలనలో బీహార్ రాజధాని పట్నాను క్రైమ్ క్యాపి టల్‌గా మార్చారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పట్నాలో వ్యాపారి గోపాల్ ఖేమ్కా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయ దుమారం రేపుతోంది.
ఈ హత్యతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు అధికార ఎన్డీయే కూటమిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. వ్యాపారి హత్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘ఎన్డీయే పాలనలో బీహార్ భారతదేశ నేర రాజధానిగా మారిపోయింది. ప్రస్తుతం బీహార్ దోపిడీలు, కాల్పులు, హత్యల నీడన బతుకుతోంది.
ఇక్కడ నేరాలు సర్వసాధారణమై పోయాయి. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. ఎన్డీయే కబంధహస్తాల నుంచి బీహార్‌ను కాపాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పౌరులను రక్షించలేని పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలెవరూ ఓటు వేయ ద్దు.’ అని ఎన్డీయే ప్రభుత్వంపై ఎక్స్‌లో విరుచుకుపడ్డారు.
పురోగతి వైపు అడుగులేసే సమయమొచ్చింది
దారుణాలు, దోపిడీలను పూర్తిగా నిర్మూలించి, పురోగతి వైపు అడుగులు వేసే సమ యం బీహార్‌కు వచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కూడా నితీశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
పట్నా నడిబొడ్డున దారుణం జరిగితే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేందుకు రెండు గంటల సమ యం పట్టిందని ఆరోపించారు. ఈ ఘటన తో వ్యాపారవేత్తలు బీహార్‌ను విడిచి వెళ్లిపోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నగరంలోని గాంధీ మైదా న్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్త గోపాల్ జేమ్కా దారుణ హత్యకు గురయ్యా డు. రాత్రి 11.40 గంటల సమయంలో ఇం టి వద్ద కారు దిగుతుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కా ల్పులు జరిపి చంపేశారు. ఈ హత్యోందం తం రాజకీయ రంగు పులుముకుంది.