20-09-2025 12:39:55 AM
అబుదాబి, సెప్టెంబర్ 19: సూపర్-4కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. శుక్రవారం పసికూన ఒమన్ మీద గెలిచేందుకు సూర్యకుమార్ సేన చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు 21 పరుగుల స్వ ల్ప తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులకు 8 వికె ట్లు కోల్పోయింది. 189 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఒమన్ 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా ఎక్కడ లేని ఆత్మవిశ్వాసాన్ని ఒమన్ మూటగట్టుకుంది. గ్రూప్ ఏ లో ఉన్న భారత్ మూడింటికి మూడు మ్యాచులు గెలిచి సూపర్-4కు అర్హ త సాధించింది. 21న భారత్ పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్ఠాత్మక సూపర్-4కు ముందు భారత్‌కు ఇది దెబ్బే అని చెప్పాలి. పేసర్లు హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ తేలిపోయారు. ఒమన్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది.