20-09-2025 12:23:57 AM
మంత్రి శ్రీధర్‌బాబును కోరిన అభ్యర్థులు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయా లని శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు. గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహించారని, కానీ డీఎస్సీ వేయలేదని నేతలు డీ హరీశ్, ఎం వెంకట్ విజ్ఞప్తి చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.