17-11-2025 10:28:40 PM
అనాధ శవానికి అంత్యక్రియలు
ఎన్ డి ఆర్ ఫౌండేషన్ అంత్యక్రియలకు ఆర్థిక సహకారం
పటాన్ చెరు: అనాధగా చివరి ప్రయాణం కూడా ఒంటరిగా అయ్యే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి, తనే కుటుంబ సభ్యుడిలా మారి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించిన ఎం డి ఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయిన అతనికి సంబంధించిన వారు ఎవరు రాకపోవడంతో, ఆస్పత్రి నుండి స్వయంగా తీసుకెళ్లి, అన్ని మానవత్వ పరమైన కర్మకాండలు చేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సమాజంలో తమ పని, తమ జీవితాలకే పరిమితమైపోయే ఈ రోజుల్లో, ఇతరుల కోసం ఇలా ముందుకు వచ్చి చేయూతనిచ్చే మనుషులు చాలా అరుదు. ఎం డి ఆర్ ఫౌండేషన్ చేసే సేవా భావం, కరుణ, మానవత్వం ప్రతీ ఒక్కరికి ప్రేరణ. ఇలాంటి సేవలు సమాజాన్ని మరింత మంచిదిగా మార్చుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.