17-11-2025 10:20:02 PM
విద్యుత్ శాఖ ఏఈ వాస శ్రీకాంత్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగింపు పనులు చేపట్టనున్నందున రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అడివెంల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం ఫీడర్ తో పాటు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ వాస శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నందున వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.