calender_icon.png 18 November, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు న్యాయం చేయండి...!!

17-11-2025 10:32:51 PM

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

గుమ్మడిదల: అనంతారం గ్రామ రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. అనంతారం గ్రామ సర్వే నెంబర్ 173, 174 భూములను ఇటీవల ప్రభుత్వ భూములుగా నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రావిణ్యకు ఈ భూములపై పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న పట్టా భూములను ఒక్కసారిగా ప్రభుత్వ భూములుగా గుర్తించడం సరైన విధానం కాదని తెలిపారు.

రైతులు పలుమార్లు దరఖాస్తులు సమర్పించినా అధికారులు స్పందించకపోవడం తీవ్రమైన అన్యాయం అని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకుని భూములను తిరిగి రైతుల పేర్లకే నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరారు. దశాబ్దాలుగా రైతులే సాగు చేస్తున్న భూములను ప్రభుత్వ భూములుగా మార్చడం అన్యాయం అని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రజాపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.