17-11-2025 10:38:59 PM
బిఆర్టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి
పటాన్ చెరు: అమీన్ పూర్ లోని సుల్తాన్ పూర్ ఇండస్టీ ఐటీ పార్క్ ఏరియాలో ఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గత నాలుగు నెలల నుండి వెంకటేష్ అనే కార్మికుడు గత నెలల నుంచి కంపెనీలో పనిచేసేవారు, కంపెనీ పని చేస్తున్న టైంలో జాగ్రత్తలు సేఫ్టీ అలాంటివి ఏమి పట్టించుకోకుండా జెసిబి ట్యాంకు నందు డీజిల్ పోయడానికి జెసిబి బొక్కనలో ఎక్కించారు దాంతో అకస్మాత్తుగా జెసిబి బొక్కనపై నుండి కింద పడిపోయి మెదడుకు తీవ్ర గాయం అవ్వడంతో అక్కడున్న కార్మికుల యజమాన్యం వెంటనే దగ్గర్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా, ఇంకా మెరుగైన వైద్యం కోసం బేగంపేట్ లో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
వెంకటేష్ భార్య స్రవంతి అతను తొందరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని స్రవంతి ఎక్కడెక్కడ ఆస్పత్రికి తీసుకెళ్ళింది అయినా ఫలితం లేదు అతను మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాక ఒక మూడు రోజుల్లో ఇంటిదగ్గర చనిపోవడం జరిగింది. కార్మికుడి భార్య స్రవంతికి పలుమార్లు కంపెనీ యాజమాన్యం నీ ఎన్నిసార్లు అడిగినా స్రవంతి కుటుంబం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తనను ఏదో రకంగా కంపెనీ యజమాన్యం పట్టించుకోవడం లేదు అని తెలుసుకొని అడిగి విసుగు చెందిన స్రవంతి కుటుంబ సభ్యులుకి ఏం చేయాలో అర్ధం కాక ఎవరైతే కార్మికులకు న్యాయం చేస్తారని తోటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని, బి ఆర్ టి యు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి ఆవార్డు గ్రహీత రవి గురించి తెలుసుకొని తన కార్యాలయం వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించాడు.
వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన ఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్దకు బయలుదేరి యజమాన్యంతో పలుమార్లు చర్చించి చనిపోయిన కార్మికుని కుటుంబానికి రావలసిన నష్టపరిహారం హాస్పటల్ ఖర్చులు మూడు లక్షల రూపాయలు, అలాగే చనిపోయిన కుటుంబ సభ్యుల భార్యా పిల్లలకి 6,50,000 రూపాయలు, మొత్తం కలిపి 9,50,000 రూపాయలు, చనిపోయిన కార్మికుని కుటుంబానికి చెక్కు రూపంలో అందజేశారు. కార్మికుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా కుటుంబానికి న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ పాల్గొన్నారు.