17-11-2025 10:44:07 PM
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని లక్ష్మీనారాయణ రైతు ఆవేదన
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కంజర్ల గ్రామంలో గొల్ల లక్ష్మీనారాయణ మూడు బార్లు మేతకు వేయడానికి చిన్న కన్జర్ల అండూర్ మధ్య మేతవేయడానికి వెళుతుండగా విద్యుత్ స్తంభాల ఎల్ టి లైన్ తెగపడి మూడు బార్లు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఒక్కొక్క బర్రె ఖరీదు సుమారు 1,50,000 ఉంటుందని గొల్ల లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ తెగపడి ఈ బర్రె జీవన ఆధారం కాబట్టి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ప్రభుత్వ విద్యుత్ అధికారులు స్పందించి లక్ష్మీనారాయణకు న్యాయం చేయాలని ఆయన గ్రామస్తులతో విన్నవించుకున్నాడు.