calender_icon.png 18 November, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

17-11-2025 10:17:46 PM

మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య

హన్మకొండ (విజయక్రాంతి): హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం కనీసస్పందన చూపడం లేదని రాజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గోసలు పడుతుంటే, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మొద్దునిద్రలో ఉంది అని ఆయన మండిపడ్డారు.  తేమ శాతం పేరుతో కొనుగోళ్లు తిరస్కరించడం, సీసీఐ ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేస్తా మని కొత్త నిబంధనలు విధించడం రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు.

ప్రైవేట్ దళారుల దయపై రైతులు ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోందని, దీంతో క్వింటాకు రూ.1,300 వరకు పత్తి రైతులు నష్టపోతూ, బీదరికంలో కూరుకుపోతున్నారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ముంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే,బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళనలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఓటమి తమ పార్టీపై మరింత బాధ్య తను మోపిందని, ప్రజల తరఫున తమ ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తామని రాజయ్య స్పష్టంచేశారు. 

నేడు హరీష్ రావు ఏనుమాముల మార్కెట్ సందర్శన

రైతు సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు నేడు ఎనుమాముల వ్యవ సాయ మార్కెట్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించనున్నట్లు  మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. పత్తి రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికను ఓరుగల్లు నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.