calender_icon.png 2 January, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం

25-04-2024 01:26:00 AM

పాలసీదారులకు 

ఎల్‌ఐసీ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కొంతమంది వ్యక్తులు/సంస్థలు ఎల్‌ఐసీ పేరిట సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటివాటి పట్ల ఆప్రమత్తంగా ఉండా లంటూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పాలసీదారులను హెచ్చరించింది. తమ బ్రాండ్‌నేమ్, లోగో, సీనియర్ అధికారుల ఫొటోలను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడి యా ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారాన్ని ప్రకటన రూపంలో ప్రచు రిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తాజాగా ఎక్స్ పోస్టులో ఎల్‌ఐసీ వివరించింది. అటువంటి తప్పుడు ప్రకటనల్ని చూసి మోసపోవద్దని, యూఆర్‌ఎల్ లింక్స్‌ను ఎల్‌ఐసీకి చెందిన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌కు షేర్ చేయాలని ఎల్‌ఐసీ పబ్లిక్‌ను కోరింది. అనుమతి లేకుం డా తమ బ్రాండ్‌నేమ్‌ను ఉపయోగించుకుని మోసపూరిత కార్యకలా పాలకు పాల్పడుతున్నవారిపై తగిన చట్టపరమైన చర్యల్ని తీసుకుంటామని తెలిపింది.