calender_icon.png 12 October, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో సుప్రీం

12-10-2025 02:42:56 AM

జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టే పై రేపు స్పెషల్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

న్యాయకోవిదులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు, మీనాక్షి  జూమ్ మీటింగ్

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చి న స్టేపై సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. హైకోర్టు ఇచ్చి న స్టేను ఎత్తివేసి ఎన్నికలకు అనుమతి ఇ వ్వాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖ లు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

రిజర్వేషన్ల అంశంపై ప్రావీణ్యం క లిగిన అడ్వొకేట్స్ అభిషేక్ మను సింఘ్వీ తో పాటు సిద్ధార్థదవేతో వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసిం ఘ్వీ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీ నాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ తదితరులు జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ప్రభావం, తదుపరి న్యాయపరమైన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి న్యాయపోరా టం చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. దీం తో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లే లక్ష్యం గా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. కాగా, జీవో 9పై హైకోర్టు స్టే విధి స్తూ 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖ లు చేయాలని, అలాగే ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారా లకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆర్డర్ కాపీని వెలువ డింది. జీవో 9, 41, 42లపైనే హైకోర్టు స్టే విధించింది.

ట్రిపుల్ టెస్టు పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిం ది. సుప్రీంకోర్టు నింధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండటాన్ని తప్పుపట్టింది. వికాస్ కృష్ణారావు, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను హైకో ర్టు పరిగణలోకి తీసుకున్నది. జీవో 9కి వ్యతిరేకంగా కొందరు కోర్టులో సవాల్ చేయడం తో రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన స్థానిక సంస్థ ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.