01-12-2024 02:47:50 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): దామగుండం ప్రజాసంఘాలతో చర్చించడం, లగచర్లతో గిరిజను లతో మాట్లాడటం ప్రజాపాలన అవుతుందని, అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ 23వ మహాసభలు శనివారం ఎస్సార్ నగర్‌లోని శ్రీనివాస్‌నగర్ కమిటీ హాల్‌లో జరిగాయి. ఈ మహాసభలను మొదటిరోజు తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
సోషలిజమే అసమానతలకు పరిష్కారం
సోషలిజమే అసమానతలకు పరిష్కారమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. శనివారం జరిగిన సీపీఎం మహాసభల్లో ఆయనపాల్గొని హైదరాబాద్ కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత భాస్కర్‌రావుపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు దశరథ్, నాగలక్ష్మి, వెంకటేశ్ అధ్యక్షతన ఈ మహాసభలు జరిగాయి.