calender_icon.png 24 January, 2026 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్సీ ఆఫీసుకు ఫ్యాన్ల విరాళం

24-01-2026 03:31:37 PM

మునిప‌ల్లి,(విజయక్రాంతి): కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మ‌న్ గ‌ల్ల సంతోష‌మ్మ ఆధ్వర్యంలో మునిపల్లి మండలంలోని ఎమ్మార్సీ కార్యాలయానికి నాలుగు ఫ్యాన్లను శ‌నివారం ఎంఈఓ భీంసింగ్ చేతుల మీదుగా  విరాళంగా అంద‌జేశారు.

ఈ సందర్భంగా ఎంఈఓ  భీమ్ సింగ్  ట్రస్ట్ ప్రతినిధులైన శ్రీనివాస్ , సంతోషమ్మ దంపతులను అభినందించి ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు మ‌రెన్నో నిర్వ‌హించాల‌న్నారు.  అనంత‌రం  ట్ర‌స్ట్ ప్ర‌తినిధుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండ‌ల అధ్య‌క్షుడు నీలి ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌ల్ల సంతోషమ్మ, నాయ‌కులు గోవర్థన్  పాల్గొన్నారు.