13-05-2025 10:24:48 PM
కొమరారం, బోడు మండలాలు ఏర్పాటు చేయాలి..
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి న్యూడెమోక్రసీ వినతి..
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రోళ్లపాడు రిజర్వాయర్ ద్వారా అందించాలని, కొమరారం, బోడులను మండలాలుగా ప్రకటించాలని, ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం టేకులపల్లి మండలం కోయగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) స్వగృహంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Minister Bhatti Vikramarka)కి సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఒకసారి మీరు హైదరాబాద్కు వచ్చి కలిస్తే ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.