calender_icon.png 4 December, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

12-11-2024 01:03:44 AM

సిరిసిల్ల, నవంబర్ 11 (విజయక్రాంతి): అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఇల్లంతకుంట మం డలం పత్తికుంటపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బోడ రాజిరెడ్డి(40) వ్యవసాయంతో పాటు ఎలక్ట్రిషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేతి నిండా పని లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. తీర్చే మార్గం లేకపోవ డంతో మనస్థాపానికి లోనై తన పత్తి చేనులో పురు గుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.