22 March, 2026 | 2:23 PM

బోరు బావిలోకి దిన రైతు.. ఊపిరాడక మృతి

21-07-2024 06:56 PM

కలకోవ : సూర్యపేట జిల్లాలో ఓ రైతు వ్యవసయ బావిలోకి దిగి ఊపిరాడక మృతి చెందాడు. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన కొమర్రాజు లక్ష్మయ్య అనే రైతు తన పొలంలో వ్యవసాయ చేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నాడు. దీంతో తన బోరు బావిలో ఉన్న మోటారు చెడిపోవడంతో రైతు లక్ష్మయ్య మరమ్మతులు చేసేందుకు బావి చుట్టూ గుణలు వేసి ఉండటంతో బావి లోపలికి దిగాడు.

దీంతో గుణలో ఊపిరాడక లక్ష్మయ్య బావిలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి దగ్గరకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని బోరు బావిలోంచి తీయడానికి జేసీబీ సహాయంతో బావి చుట్టూ గుంతను తోవుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది.