సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు
కరీంనగర్: తిమ్మాపూర్ మండల పరిధిలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (అటానమస్) కళాశాల ఆవరణలోని శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమను ఆలయ పూజారులు వేద శ్లోకాల మంత్రోచ్ఛరణల మధ్య సాయిబాబా దేవుడికి అభిషేకం సహా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని మామిడి అరటి ఆకులు తోరణాలతో వివిధ రకాల పూలతో అలంకరించారు.
ఆలయ ప్రాంగణం రంగుల మయం చేశారు. హారతికి జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు చైర్ పర్సన్ విజయలక్ష్మి పాల్గొని, వేడుకలను తిలకించేందుకు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదే ప్రాంగణంలో కొలువుదీరిన సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందజేశారు.
గురు పూర్ణిమ అనేది చాలా పవిత్రమైన వేడుక, ఇది ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత ఎదుగుదలలో గురువుల యొక్క పాత్రను గౌరవించే సమయాన్ని గుర్తించే విద్యా మరియు ఆధ్యాత్మిక గురువులను గౌరవించటానికి జరుపుకుంటారు. ఇందులో దేవాలయాలు మరియు ఆశ్రమాలను సందర్శించి ప్రార్థనలు చేయడం మరియు గురువులకు అంకితమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.




