calender_icon.png 13 September, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగింపు క్రీడా ఉత్సవాలకు పి వి ఆర్ ను ఆహ్వానించిన చేపూర్ విడిసి

13-09-2025 04:19:00 PM

చేపూర్ విడిసి సభ్యులు వినయ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానం..

ఆర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ మండలంలోని చేపూర్ పల్లె గ్రామాల వీడీసీలు శనివారం ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటి చిన్నారెడ్డి(Surakanti Chinna Reddy) ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రెండు గ్రామాలలో ఉన్న సమస్యలను వివరించి వినతి పత్రం ఆయనకు అందించారు. అలాగే చేపుర్ ఉన్నంత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి ఆధ్వర్యంలో 15 నుంచి 17 వరకు జరుగుచున్న అంతర్ రూరల్ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. వీటన్నిటికీ ఆయన సనుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో చేపూర్. పల్లె గ్రామాల వీడిసి అధ్యక్షులు సారాంగి శ్రీకాంత్.ఎత్తినీ బీరయ్య. రెండు గ్రామాల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు దాసరి శ్రీకాంత్. లక్కవత్రి రామ్ సన్. తాజా మాజీ సర్పంచ్ ఇందూరు సాయన్న. మాజీ ఎంపీటీసీలు జన్నెపల్లి గంగాధర్. ఎల్క రంజిత్ కుమార్. ఓబిసి మండల అధ్యక్షుడు మాజీ ఉపసర్పంచ్ కటికే శ్రీనివాస్. సొసైటీ మాజీ డైరెక్టర్ సారంగి శాంతి. సింధూకర్ చరన్. జోరిగే ధర్మయ్య. నితిన్. గంగాధర్. రాజేశ్వర్. పల్లె రామాలయ కమిటీ అధ్యక్షుడు నర్సయ్య. కోశాధికారి కపిల్ గౌడ్. బిల్డర్ శంకర్. అంకమల్ల శంకర్. లింబద్రి గౌడ్.తదితరులు పాల్గొన్నారు.