calender_icon.png 13 September, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎం.ఎం.పీ.టీ.ఎఫ్ అమలుకు సహాయ సహకారాలు అందిస్తాం

13-09-2025 03:58:49 PM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్ (విజయక్రాంతి): వలసదారులు, దుర్బల కుటుంబాల స్థితి స్థాపకతను మెరుగుపర్చాలనే లక్ష్యంతో యుఎన్ఓ ద్వారా ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్ నర్ ఫండ్(ఎం.ఎం.పీ.టీ.ఎఫ్) కార్యక్రమాన్ని పక్కాగా అమలు పరుస్తూ, నిర్దేశిత లక్ష్యాలు సిద్ధించేలా జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) అన్నారు. ఈ కార్యక్రమం అమలు విషయమై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం జరిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం, పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి మండలాలను ఎంపిక చేయడానికి గల కారణాలు, ఎంఎంపీటీఎఫ్ ను అమలు చేస్తున్న విధానం, యూఎన్ఓ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందించే తోడ్పాటు తదితర అంశాలపై చర్చించారు.

జిల్లాలో వలసదారులు, దుర్బల కుటుంబాల స్థితిగతులలో మార్పును తేవాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలయ్యేలా జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రాజెక్టు అమలయ్యేలా చూస్తామని అన్నారు. సమావేశంలో జెడ్పి సీ.ఈ.ఓ సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, డీపీఆర్ఓ ఎన్.పద్మశ్రీ, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యుఓ రసూల్ బీ, డీపీఓ శ్రీనివాస్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు రోహిత్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మధు సూదన్, కార్మిక శాఖ అధికారి యాదయ్య, యూఎన్ఓ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.