13-09-2025 04:13:04 PM
ఆర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఆవరణలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాల మండలాల సంయుక్త సమావేశము విజయలక్ష్మి, లలిత, స్రవంతి జిల్లా అధ్యక్షురాలు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ.. పాఠశాలలలో వంటలు చేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికులు అంటే ప్రభుత్వానికి, అధికారులకు చిన్నచూపు అన్నారు. అందుకే వారి సర్వీసు, సేవాభావానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హేళనగా చూస్తున్నారన్నారు. వంట కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే వంటలు చేస్తున్న సందర్భంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా జరిగాయన్నారు.
ఈ మధ్యకాలంలో మాక్లూర్ మండల అమ్రధ్ గ్రామంలో వర్ని మండలంలోని మోస్ర చందూరు లలిత భూమవ్వ లక్ష్మి కార్మికురాలు ఇలా గంజి పడి ఒకరు, కుక్కర్ పేలి ఒకరు కూర పడి ఒకరు ఇలా అనేక మంది వంట కార్మికులకు విపరీతమైన గాయాలై నడువలేని స్థితిలో ఉన్నారు అన్నారు ఇదంతా విధ్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందిస్తున్న సందర్భంలో జరిగినవే లక్షలాది రూపాయలు వారు స్వంతంగా పెట్టుకోవలసిన పరిస్థితితులు వీరు ప్రభుత్వం లో భాగస్వాములు కారా వారి ఖర్చులు ప్రభుత్వం భరించకూడదా అన్నారు .కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి వంట కార్మికులకు భీమా కల్పించి పరిహరాలు అందించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే లక్షలాది రూపాయలు స్వంత డబ్బులు పెట్టి వంటలు చేస్తుంటే ఆ బిల్లులు నేలల తరబడి పెండింగ్లో ఉండి అప్పులఆ పాలౌతుంటే, మల్లీ ప్రమాదాలు జరుగుచున్న సందర్భంలో ప్రభుత్వం భరించక పోతే ఎలా అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పరిహరాలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్రంలో ఉన్న 54200 మంది వంట కార్మికులను సమీకరించి ఏఐటియుసి నాయకత్వంలో ఉద్యమాలు నిర్వహస్తము అన్నారు. ఈ సమావేశంలో కృష్ణ భాయి, కవిత, లక్ష్మి, రమ్య, పోసాని ,సాయమ్మ, సత్యమ్మ ,దాసు, వసంతు, కార్మికులు పాల్గొన్నారు.