13-09-2025 04:09:30 PM
నియోజకవర్గంలో పలు కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ఆర్మూర్ (విజయక్రాంతి): ఆర్మూర్ నియోజకవర్గంలో పలు కుటుంబాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Armur MLA Paidi Rakesh Reddy) పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని భగవంతుడు కల్పించాలని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అదేవిధంగా పలు మండలంలో వివిధ గ్రామాలలో బిజెపి కార్యకర్తలు నాయకులతో కలిసి గ్రామంలోని ఫతేపూర్, మంథని, మిర్దపల్లి, ఆలూరు గ్రామాలలోని పలు కుటుంబాలను పరామర్శించడం జరిగింది. మిర్ధపల్లి గ్రామానికి చెందిన ఎన్ పి, గంగారం ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ అన్న వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం, ఆర్మూర్ పట్టణానికి చెందిన బాబా ఎగ్స్ ట్రేడర్స్ ఓనర్ బాబా ఇటీవల మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది