calender_icon.png 13 September, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ మృతి కారణమైన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

13-09-2025 04:03:04 PM

దళిత సంఘ నాయకులు..

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండల పరిదిలోని పొలంపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చెరువులో పడి మృతి చెందిన కొండి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కులం పేరుతో దూషించిందని, మృతురాలి భర్త అంజయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి ముందు ఉన్న మురికి కాలువ శుభ్రంగా ఉండే విధంగా చూడాలని కార్యదర్శిని కొండి లక్ష్మి కోరగా, ఇద్దరు మధ్య గొడవకు దారితీసింది, దీనితో పంచాయతీ కార్యదర్శి, స్రవంతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో మనస్థాపానికి గురైన లక్ష్మి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని అంజయ్య తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కార్యదర్శిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చైతన్య రెడ్డి(SI Chaitanya Reddy) తెలిపారు.

కార్యదర్శి స్రవంతిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో బైఠాయించారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు, విషయం తెలుసుకున్న, తాసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ చిన్నరెడ్డి,చేగుంట ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి, బాయిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, వారి గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమి ఒక ఎకరా, వారి భర్త పై వచ్చేటట్లు చూస్తామని తాసిల్దార్ ఎంపీడీవో చెప్పడంతో, కుటుంబ సభ్యులు ధర్నాను విరమించారు, అనంతరం కుటుంబ సభ్యులకు  దహన సంస్కరణలు  తహసిల్దార్, ఎంపీడీవో 50వేల రూపాయల నగదు, అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, దళిత సంఘ నాయకులు తదితరులు,పాల్గొన్నారు