calender_icon.png 13 September, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ పోలీసు అంటున్న ప్రయాణికులు

13-09-2025 04:54:17 PM

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ నడిబొడ్డున పోలీస్ హెడ్ క్వాటర్స్ ముందు సిగ్నల్ దగ్గర ఆగిన రెడీమిక్స్ వాహనము ఒక్కసారిగా సిగ్నల్ ఓపెన్ కావడంతో ముందుకు పరిగెత్తింది అంతలో ఆ వాహనంలో నుంచి కొద్ది మొత్తంలో సిమెంట్ నేల పాలయ్యింది. అది గమనించిన అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ తనలో మానవత్వం గుర్తుకొచ్చి ఆ సిమెంటును వృధా కాకుండా హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్లి పార తీసుకువచ్చి ఆ సిమెంట్ అంతా పోగు చేసి దగ్గరలో ఉన్న గుంతలను పూడ్చాడు. దీనికి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు, పున్నం చందర్, షబ్బీర్ అలీలు సహకరించారు. గుంతలను పూడ్చిన కానిస్టేబుల్ ను చేసిన వాహనదారులు శభాష్ పోలీసు అంటూ మెచ్చుకున్నారు.