19-05-2025 12:06:02 AM
-ఖజానా నింపేందుకు మద్యం ధరల పెంపు
-మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): బీర్లు, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో మద్యంపై రాద్ధాం తం చేసిన వాళ్లే, మద్యం ధరలు పెంచి వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
మద్యం ధరల పెంపుపై ఆదివారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. ఒకవైపు మద్యం ధరలు పెంచడం, మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వ ఆంతర్యం స్పష్టమవు తోందని విమర్శించారు.
అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు చర్యల వల్ల రాష్ర్ట ఆర్థిక ప్రగతి రోజురోజుకీ క్షీణిస్తుండగా, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు మద్యం ధర లు పెంచడం కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. మద్యం నియంత్రణ విషయంలో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క హామీ అయి నా అమలు చేశారా అని ప్రశ్నించారు.
ఇష్టారీతిన మద్యం ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా ఖజా నా నిలుపుకోవాలని చూస్తారా అని నిలదీశారు. తాగుబోతుల తెలంగాణ చేసి, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణను నంబర్ వన్ చేస్తారా అని ధ్వజమెత్తారు. ఒకవైపు ఎక్సుజ్ ద్వారా ప్రజల నుంచి డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తూ, మరోవైపు ప్రజలకు అందిం చే సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయలేదన్నారు.
కాగా సర్కారు ఖజనాను నింపుకోవాటానికి గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలో మీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని తాగుబోతు ల తెలంగాణ చేసి, భార్యా పిల్లలను రోడ్ల మీద పడేస్తారా అని హరీశ్‌రావు మండ్డిపడ్డారు. యువత బతుకులను ఆగం చేస్తారా అని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్‌లో ఉ న్నవి రెండేనని.. అవి ఒకటి పన్నులు, రెండు తన్నులు అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.