13-09-2025 04:43:10 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ మండలం కర్ణకోట్ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన చిన్న(32) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబం పెద్ద, నిరుపేద కుటుంబం కావడంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న తాండూరు ప్రముఖ వైద్యులు, డివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, డాక్టర్ సంపత్ కుమార్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అంత్యక్రియలకు ఆ గ్రామానికి చెందిన డి. శివకుమార్, గంగే లక్ష్మప్ప, లింగప్ప, దస్తప్ప తదితరుల ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఆదుకున్న డాక్టర్ సంపత్ కుమార్ కు ఆ నిరుపేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
మరోవైపు తాండూరు పట్టణం నెహ్రు గంజ్ లో హమాలి పనిచేసే వార్డ్ నెంబర్ 2 లో భరత్ నగర్ చెందిన లాలప్ప అకాల మరణం చెందడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క అంత్యక్రియలకు BVG ఫౌండేషన్ ద్వారా తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సాయం అందించారు.