13-09-2025 04:05:37 PM
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడి
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు రైల్వే ప్రయాణం మరింత దగ్గర
ప్రయాణికులకు తొందరగా దూసుకుపోవడానికి ముందుకు వస్తున్న వందే భారత్
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ముంబైల మధ్య వందేభరత్ రైలు కోసం ప్రయత్నిస్తున్నానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్(BJP MP Dharmapuri Arvind) పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ ఛాంబర్స్ ఆఫ్ కామోర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులుగా రాజు, కార్యదర్శిగా శ్రీనివాసరావు, బెజవాడ గణేష్ గుప్తాల చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా మధ్య రైల్వే లైన్ కు మాజీ సీఎం కేసీఆర్ సంతకం చేయలేదని గుర్తు చేశారు.
కేవలం కేంద్ర ప్రభుత్వం స్వంత నిధులతో మాత్రమే పనులు చేస్తున్నమన్నారు. ఇక జిల్లాతో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జిల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. వ్యాపార, వాణిజ్య లకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఛాంబర్ ఆఫ్ కామోర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ ప్రెసిడెంట్ అడ్వకేట్ జగదీశ్వర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.