calender_icon.png 14 May, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంతోషం ముఖ్యం

14-05-2025 01:05:37 AM

  1. సృష్టికి జీవం పోస్తున్న రైతన్నకు బాధలు రానివ్వం 
  2. దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి

భూత్పూర్ మే 13 : సృష్టికి జీవం పోస్తున్న రైతన్న సంతో షం గా ఉండాలని సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం ముం దుకు సాగుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట్ మండలం జానంపేట గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట్ మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం 67 ట్రాన్స్ఫార్మర్లు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షం లో ఉన్నప్పుడు లో ఓల్టేజ్ విద్యుత్ కారణంగా పంటలు ఎండిపోతే ఇదే (జానంపేట) సబ్ స్టేషన్ వద్ద, లో ఓల్టేజీ సమస్యలు తీర్చాలని తాము ధర్నా నిర్వహించామని, అయినా నాటి ప్ర భుత్వం రైతుల యొక్క లో వోల్టేజ్ సమస్యను పట్టించుకోలేదన్నారు. నాటి రైతుల బాధలను స్వయంగా చూసిన అనుభ వంతో నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నానని తెలిపారు.

అందులో భా గంగా రైతులకు కరెంటు కష్టాలను తీర్చేందుకు సిఎండితో చ ర్చించి, నియోజకవర్గంలో లో ఓల్టేజీ సమస్య లేకుండా ట్రా న్స్ఫార్మర్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని జడ్చర్ల సబ్ డివిజన్ పరిధిలో పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో 3 కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల పాలనలో 8 కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ఉప ముఖ్యమంత్రి మూసాపేట్ మండలంలో రూ 30 కోట్ల నిధులతో 133 కె. విసబ్‌స్టేషన్ ప్రారంభించబోతున్నారని తెలియజేశారు.

భూత్పూర్, అడ్డాకుల్, మూసాపేట్ మండలాలతో కలిపి సబ్ డివిజన్ ఏర్పాటు చెయ్యాలని, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే విద్యుత్ శాఖ కు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, నియోజకవర్గంలో 11KV విద్యుత్ లైన్ల సమస్య పరిష్కరించాలని సిఎండి గారిని కోరమని, వారు దానికి సానుకూలంగా స్పందించారని అన్నా రు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల కాలంలో భూత్పూర్, మూసాపేట్, అడ్డాకుల, మండలాల గృహ జ్యోతి లబ్ధిదారుల 5 కోట్ల 2 లక్షల రూపాయల కరెంట్ బిల్లును వి ద్యుత్ శాఖ కు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.

ఒకపక్క రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వానంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క హా మీని నెరవేరుస్తుంటే, మతిభ్రమించి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు మరియు ఈటల రాజేందర్ లాంటివారు పిచ్చి కూతలు కూస్తున్నారని అన్నారు. ము ఖ్యంగా కేటీఆర్ కు మతిభ్రమించిందని అన్నారు.

బీ ఆర్‌ఎస్ కుట్రలే తెలుసు మంచి తెలియదు

బిఆర్‌ఎస్ కు కేవలం కుట్రలు చేయడం ప్రజలను నమ్మించడం మాత్రమే తెలుసు అని మంచి చేయడం అస్సలు తెలి యదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం పోలిక లేదని.. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ తో చెడి, తన ఆస్తులు కాపాడుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరిన నాయకుడు ఈటెల రాజేందర్ అని...

నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి, నియంత కేసీఆర్ ను గద్దెదించేందుకు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి, తెలంగాణ ప్రజల గొంతుకై, తెలంగాణ ప్రజలను ఏకం చేసి నియంత కేసీఆర్ ను గద్దె దించిన పోరాటయోధుడు రేవంత్ రెడ్డిని పేర్కొన్నారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయపడి అసెంబ్లీకి రావడం లేదని, గత నెల 27 నాడు కనిపించి, మళ్లీ ఫాం హౌస్ కే పరిమితమయ్యాడని విమర్శించారు. అనంతరం తిమ్మాపూర్ గ్రామంలో హై మాస్ట్ లైట్లను ప్రారం భించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.