calender_icon.png 14 May, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంను కలిసిన ఆర్టీఐ కమిషనర్, ఎమ్మెల్యే

14-05-2025 01:03:25 AM

రాజేంద్రనగర్, మే 13:రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీ నివాసి దేశాపాల్ భూపాల్ నూతనంగా ఆర్టీఐ కమిషనర్‌గా నియమితులైన నేపథ్యంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సోషల్ సర్వీస్‌లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది.

ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్న దేశాపాల్ భూపాల్‌ను ఆర్టీ ఐ కమిషనర్‌గా నియమించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే తన లేఖ ద్వారా సిఫారసు చేయగా భూపాల్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేపథ్యంలో మంగళవారం ఆర్టీఐ కమిషనర్ ఎమ్మెల్యే సీఎం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.