03-09-2025 07:35:53 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కోతుల బెడద నుండి పంటను కాపాడుకోవడానికి చేను చుట్టూ అమర్చిన విద్యుత్ తీగల కారణంగా విద్యుదాఘాతానికి గురై రైతు దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురు మండలం మూడు గుట్టల తండాలో జరిగింది. నెల్లికుదురు ఎస్ఐ రమేష్ బాబు కథనం ప్రకారం, తండాకు చెందిన భానోతు యాకు(33) తాను సాగు చేసిన మొక్కజొన్న పంటకు కోతుల బెడద తీవ్రం కావడంతో పంట చుట్టూ కరెంటు తీగలు పెడుతుండగా ప్రమాదవశాత్తు, అదే విద్యుత్తు తీగలకు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతురాలి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కోతుల బెడదకు కరెంటు పెడితే కర్షకుడు దుర్మరణం పాలైన ఘటన తండాలో తీవ్ర విషాదం నెలకొంది.