calender_icon.png 21 November, 2025 | 9:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి

21-11-2025 12:00:00 AM

కామారెడ్డి, నవంబర్ 20 (విజయక్రాం తి) : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మిక్కనూర్ మార్కెట్ యార్డ్ లో రూ. 50 లక్షలతో నిర్మించనున్న మార్కెట్ కమిటీ ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణం కొరకు చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకం ఇచ్చి మిగతా పథకాలాన్ని రద్దుచేసి మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు యంత్రా లు గిట్టుబాటు ధరలు రైతులు భరోసా రైతు బీమా అందిస్తుందన్నారు. వ్యవసాయానికి మౌలిక సదుపాయాలు సబ్సిడీలు అందిస్తూ కూరగాయల సాగు వంటి వాటి మీ ప్రోత్సహించడానికి ఎకరాకు 9600 సబ్సిడీలు అందిస్తామన్నారు. వ్యవసాయ ఆంధ్రీకరణకు భారీ సబ్సిడీలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. రైతు లకు వేసే విధానాలపై శిక్షణ కోసం ప్రతి మండలం నుంచి 120 మంది రైతులను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందుల విష్ణు పరీక్ష కేవలం అందించడానికి సామర్ధ్యాన్ని పెంచడానికి రైతు చైతన్య యాత్రలు రైతు సదస్సులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం ఈ పథకాలను విజయవంతంగా అమ లు చేయడానికి రైతుల ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు.

రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాది రూ.12000 వేలు రెండు పంట డిజైన్లను కలిపి ఎకరాకు రూ.6000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. వారి పంట వేసిన రైతులకు మద్దతు ధరతో పాటు కుంటలకు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరను ఇస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.

పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా ద్వారా కొనుగోలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలలో భాగంగా రైతుల కు రుణమాఫీ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసి చూపించమన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ని అందిస్తున్నమన్నారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్క ర్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, బిక్కనూర్ సీతారామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, పాలకమండలి ప్రతినిధులు, కమిటీ డైరెక్టర్లు,మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.