calender_icon.png 17 May, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఆందోళన

17-05-2025 12:00:00 AM

  1. తనిఖీ చేసిన తూనీకలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ 
  2. కేసు నమోదు 

పటాన్ చెరు, మే 16 : మండల కేంద్రం జిన్నారంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరుగుతోందంటూ రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో జిల్లా తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.  తూకం వేసిన బస్తాలను అధికారులు తెచ్చిన మిషన్లో  పరిశీలించారు. 

ఒక సంచిలో 750 గ్రాములు మరో సంచిలో 800 గ్రాముల ధాన్యం ఎక్కువగా ఉందని గుర్తించారు. సంచుల్లో ఎక్కువ ధాన్యం నింపి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చేస్తున్న మోసంపై కేసు నమోదు చేసిన్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్కు నివేదిస్తామన్నారు.