calender_icon.png 17 May, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దట్టమైన అటవీ ప్రాంతంలో జియో సెల్ ఫోన్ టవర్ ప్రారంభం

16-05-2025 11:27:03 PM

పూజారి కాంకేర్ గ్రామ గిరిజనుల అభివృద్ధికి దోహదం

త్వరితగతిన సమాచారం అందించేందుకు అవకాశం

చర్ల,(విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లా  శుక్రవారం  మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పూజారి కాంకేర్ అటవీ గ్రామంలో  జియో మొబైల్ సేవలను పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో  ప్రారంభించారు. పోలీస్ బెటాలియన్ సెక్యూరిటీ తో ఏర్పాటు చేయబడిన ఈ జియో టవర్  ద్వారా దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా సిగ్నల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది, దీంతో పోలీస్ వ్యవస్థ కు సమాచారాన్ని మరింత వేగవంతంగా అందించేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో అటవీ ప్రాంతంలోని గిరిజనులకు సెల్  నెట్వర్క్ సమస్య తీరిపోయింది, గ్రామస్తులంతా తమ బంధువులకు జియో సిగ్నల్ నుంచి ఫోన్ చేసుకొని సంతోష వ్యక్తం చేశారు, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 196 బెటాలియన్       గుల్షన్ టిర్కీ డిప్యూటీ కమాండెంట్, రమేష్ నాయక్ అసిస్టెంట్ కమాండెంట్, హరీష్  అసిస్టెంట్ కమాండెంట్, ప్రేమ్ జిత్ అసిస్టెంట్ కమాండెంట్, సిఆర్పిఎఫ్ 196 బి ఎన్ బెటాలియన్ జవాన్లు గ్రామస్తులు పాల్గొన్నారు,