11-10-2025 09:28:18 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వైబ్రేంట్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వారి కెరీర్ గైడెన్స్ పై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ను వైబ్రేంట్ అకాడమీ డైరెక్టర్, సిటీ మహిళా డిగ్రీ కళాశాల డైరెక్టర్ చిట్టేటి రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో వివిధ పేరు పొందిన ఇంజనీరింగ్ కళాశాలలు పాల్గొన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఏ కోర్సు, బ్రాంచ్, ఫీజులు, వసతి సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు తదితర సమాచారం వివరించేలా ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల కౌన్సెలర్లు స్టాల్స్ నందు అందుబాటులో ఉన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు వారి కళాశాలలో ఉన్న కోర్సులు, ప్లేస్మెంట్స్ గురించి వివరించారు. ఈ కెరీర్ గైడెన్స్ సెమినార్ లో అధిక సంఖ్య లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.