11-10-2025 09:20:23 PM
యదేచ్చగా అమీన్ పూర్, పటేల్ గూడాని అడ్డా చేసుకొని దందా చేస్తున్న మాజీలు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ అక్రమాలను అడ్డుకట్ట వేస్తాం
అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపాలిటీలో రోజురోజుకు మాజీల వసూలు పెరిగిపోతుంది. శనివారం మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ వసూలపై బీఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్, బాల్ రెడ్డి, మాణిక్ యాదవ్, రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాణిక్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పదవులు పోయిన మాజీ పాలకుల కనుసన్నుల్లో మున్సిపల్ కమిషనర్ పనిచేయడం సరికాదన్నారు.
ఎన్నో అక్రమాలు చేసి ప్రజలను నిండా ముంచిన పాలకులకు సపోర్ట్ చేయడం మున్సిపల్ కమిషనర్ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. పటేల్ గూడాలో 28 ఇండ్లని హైడ్రా కూల్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అసలు ఆ ఇళ్లకు పరిమిషన్ ఇచ్చింది ఎవరు, కోట్ల రూపాయలు దండుకుంది ఎవరు, ఆ ఇల్లు కొన్న పేద వాళ్లని రోడ్డుమీదికి తీసుకొచ్చింది ఎవరు, ఆ పేద వాళ్ళ కన్నీటి దారకు కారకులు ఎవరు, అయినా సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారు.
మున్సిపాలిటీగా మారి సంవత్సర కాలం అవుతున్న గ్రామపంచాయతీ పేరిట బ్యాక్ డోర్ పర్మిషన్ ఇస్తూ పేద ప్రజలని నిండా ఉంచుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో అక్రమాలు చేసి వందల కోట్ల రూపాయలు దండుకొని సుద్ద పూసలమన్నట్టుగా పబ్లిక్ లో తిరగడానికి సిగ్గుండాలి. ప్రజల జీవితాలతో ఆడుకున్న ఏ ఒక్కరిని వదలం అన్ని గమనిస్తున్నాం అన్నారు. ప్రజల దగ్గర నుంచి అక్రమంగా భయపెట్టి స్కీములు స్కాముల పేరిట వసూలు చేసిన ప్రతి డబ్బును తిరిగి ప్రజల దగ్గరికి చేరేవరకు వదిలేది లేదన్నారు. అక్రమార్కులకి న్యాయస్థానంలోనే బుద్ధి చెపుతాం అని ఆయన హెచ్చరించారు.