calender_icon.png 11 October, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం

11-10-2025 05:24:52 PM

జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మిరాజం.. 

తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల కళాశాల..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): విద్యార్థిని బాలికలను భాగస్వాములుగా వేదికపైకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క సూచనలతో తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి బాలికల సంక్షేమానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగా షీ టీమ్ లను బలోపేతం చేయడం, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడం కేజీబీవీలు మోడల్ స్కూల్స్ తో పాటు బాలికల కోసం ప్రత్యేక విద్యాలయాలు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, గృహలక్ష్మి, గృహజ్యోతి లాంటి ప్రతి పథకంలో కూడా మహిళా భాగస్వాములకు పెద్దపీట వేస్తూ మహిళల పేరు మీదనే అన్ని ప్రొసీడింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఎన్నో విప్లవత్మక మార్పులను తీసుకొచ్చిందని వివరించారు. అలాగే షీ టీం ద్వారా పోకిరిలను ఆకతాయిలను అరికట్టడానికి డిజిటల్ మాధ్యమం ద్వారా, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలను ప్రలోభాలను అరికట్టడంలో ముందున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఇన్చార్జి ప్రమీల ప్రిన్సిపల్ రజిని హబ్ జెండర్ స్పెషలిస్ట్ దేవిక సఖి నిర్వాహకురాలు మమత వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.